స్వ‌చ్ఛ భార‌త్ కోసం రూ. 105 కోట్లు ఇవ్వండి

కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ తో సీఎం

న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, నిర్మ‌లా సీతారామ‌న్, అశ్విని వైష్ణ‌వ్ ల‌తో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు. ఆయ‌న వెంట కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, కింజార‌పు రామ్మోహ‌న్ నాయ‌డు, వ‌ర్మ‌, ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ఏపీకి రావాల్సిన ప్రాజెక్టుల‌ను మంజూరు చేయాల‌ని కోరారు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను క‌లిసి. అనంత‌రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్ద‌రూ కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. దాదాపు గంట‌కు పైగా సాగింది వీరి చ‌ర్చ‌.

ఇదిలా ఉండ‌గా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను, వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్ కు వివ‌రించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద రూ. 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్-2.0లో భాగంగా కేంద్ర వాటా కింద రూ. 105 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *