తెలంగాణ సీఎస్ గా జ‌యేష్ రంజ‌న్..?

1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి అయిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం సీఎస్ ఉన్న రామ‌కృష్ణా రావు ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. దీంతో త‌దుప‌రి సీఎస్ గా ఎవ‌రు ఎంపిక అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా తాజాగా సీనియ‌ర్ ఏఏఎస్ ఆఫీస‌ర్ జ‌యేష్ రంజ‌న్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఆయ‌న ఇప్ప‌టికే కీల‌క‌మైన శాఖ‌ల‌కు ఇంఛార్జ్ గా ఉన్నారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో జ‌యేశ్ చ‌క్రం తిప్పారు. ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన త‌ను అఖిల భారత స్థాయిలో టాపర్ గా నిలిచాడు. ఐఐఎం కోల్ క‌తా, ల కువాన్ యూ స్క‌ల్ ఆఫ్ ప‌బ్లిక్ పాల‌సీలో చ‌దువుకున్నారు. విధాన ఆధారిత పరిపాల‌నా విధానాన్ని అమ‌లు చేయ‌డంలో అనుభ‌వం క‌లిగి ఉన్నారు. ఇటీవలి పరిపాలనా పునర్వ్యవస్థీకరణలలో, జ‌యేష్ రంజన్ డిసెంబర్ 2025లో ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ కు సీఈవోగా విధులు నిర్వ‌హించారు. ఉన్న‌ట్టుండి త‌న‌ను ప‌ట్ట‌ణ అభివృద్ది శాఖ‌కు బ‌దిలీ అయ్యారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *