మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

నిర్వీర్యం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

నెల్లూరు జిల్లా : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ఆనాడు కోట్లాది మంది పేద‌ల‌కు అన్నం పెట్టింద‌ని, కూలీల‌కు ప‌ని క‌ల్పించింద‌ని కానీ మోదీ స‌ర్కార్ వ‌చ్చాక దానిని నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు షర్మిలా రెడ్డి. త‌న తండ్రి వైఎస్ఆర్ హ‌యాంలో అనంత‌పురం జిల్లాలో ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. ఆనాటి నుంచి నేటి దాకా కోట్లాది మంది పేద‌ల‌తో ఈ ప‌థ‌కం అనుబంధం పెన వేసుకున్న‌ద‌ని చెప్పారు.

రాష్ట్ర గ్రామీణ అభివృద్ధికి మన్రేగా ఎంతో దోహదం చేసిందన్నారు. రాష్ట్రంలో YSR హయాంలో 1.10 కోట్ల జాబ్ కార్డులు ఉండేవ‌ని అన్నారు. కరువు పని తో రాష్ట్రంలో వలసలు తగ్గాయని, కరువు పని జరిగే చోట జ్యూస్ లు కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్పారు. కరువు పనికి పోయే వాళ్లకు ఆటో చార్జీలు కూడా ఇచ్చే వాళ్ళని పేర్కొన్నారు. నేడు కరువు పనిని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు. పేదవాడి పొట్ట గొట్టాలని కుట్రలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ తెచ్చిన పథకం అని చెప్పి మోదీ కుట్రలు చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి లేకుండా ఎత్తేయాలని చూస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *