ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసిన కేంద్రం

నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

నెల్లూరు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీలు, పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న చెందారు. యూపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హ‌మీ ప‌థ‌కాన్ని కావాల‌ని మార్చార‌ని, దానిని నిర్వీర్యం చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు. కొత్త చ‌ట్టం ఆమోదించ‌డం వ‌ల్ల రాష్ట్రాల‌పై అద‌న‌పు భారం ప‌డుతుంద‌న్నారు. దీని కార‌ణంగా ఏపీలో పెద్ద ఎత్తున కూలీలు, పేద‌లు, సామాన్యుల‌కు తీర‌ని న‌ష్టం జ‌రుగుతుంద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.

జాతీయ ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర‌లో భాగంగా ష‌ర్మిలా రెడ్డి చేప‌ట్టిన యాత్ర నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా ఆమెకు కావలి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆముదాల దిన్నె గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి భారీగా చేరుకున్నారు. గ్రామస్థులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, VB G – RAM G పథకాన్ని రద్దు చేయాలని, కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆనాడు YSR హయాంలో కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ పథకం అంటే గ్రామాల్లో పండుగను తలపించేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక పథకాన్ని ఉద్దేశ్య పూర్వకంగా నీరుగార్చారని ఆరోపించారు ష‌ర్మిలా రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *