బీసీల స‌త్తా ఏమిటో చూపించారు : జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డయ్యాయి. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బీసీ జేఏసీ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకిని చేరదీసి గులాబీ కండువ కప్పి, బీ ఫామ్ చేతిలో పెట్టిన బిఆర్ఎస్ పార్టీ, మాధవరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇప్పటికైనా తక్షణమే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో బీసీ సమాజం ముందు బిఆర్ఎస్ ను , మల్లారెడ్డిని దోషి గా నిలబెడతామని ఆయన హెచ్చరించారు

న్యాయమైన, ధర్మమైన బీసీ రిజర్వేషన్ల పెంపును భవిష్యత్తులో దయచేసి ఎవరూ అడ్డుకోవ‌ద్ద‌ని లేక పోతే కేశవాపూర్ ఫ‌లితం రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ అవుతుంద‌ని పేర్కొన్నారు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఇక నుంచి
ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే మెజార్టీగా ఉన్న బీసీలు కచ్చితంగా వాళ్లని బీసీ ద్రోహులుగా ప్రకటించి తీరుతార‌ని పేర్కొన్నారు. మాధవ రెడ్డిని ఏ విధంగా ఒడించామో అదే విధంగా రిజర్వేషన్ వ్యతిరేకుల కూడా రాజకీయంగా భూస్థాపితం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు .

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *