భార‌త్ భ‌ళా పాకిస్తాన్ విల‌విల

61 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ

కొలంబో : శ్రీలంక రాజ‌ధాని కొలంబో వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించింది. 114 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. 61 ప‌రుగుల తేడాతో ఓడించింది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. వ‌రుస‌గా భార‌త జ‌ట్టుకు ఇది ఎనిమిదో విజ‌యం పాకిస్తాన్ పై. కొలంబో వేదిక‌గా త్రివ‌ర్ణ ప‌తాకం ఎగిరేలా భార‌త ఆట‌గాళ్లు స‌త్తా చాటారు. కోట్లాది మంది ప్ర‌పంచ వ్యాప్తంగా దాయాదులైన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ను ఉత్కంఠ‌తో వీక్షించారు. ఇది రికార్డ్ అని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. కొలంబో స్టేడియం పూర్తిగా నిండి పోయింది. భార‌త్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా శ్రీ‌లంక ప్ర‌భుత్వం అసాధార‌ణ‌మైన రీతిలో భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా భార‌త్ బ్యాటింగ్ చేసింది. ఆదిలోనే ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ను కోల్పోయింది. అయినా ఎక్క‌డా బెద‌ర‌లేదు. ఇషాన్ కిష‌న్ సెన్సేష‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. త‌న‌కు తిల‌క్ వ‌ర్మ‌, పాండ్యా, శివ‌మ్ దూబే అండ‌గా నిలిచారు. దీంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 175 ర‌న్స్ ను ల‌క్ష్యంగా నిర్దేశించి ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ ముందు. ఆ త‌ర్వాత భార‌త బౌల‌ర్ల ధాటికి కుప్ప కూలింది పాకిస్తాన్ . ఏ కోశాన ఎదుర్కోలేక పోయారు పాకిస్తాన్ ఆట‌గాళ్లు. దీంతో 114 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు. దీంతో భార‌త జ‌ట్టు 61 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *