భారత దేశంతో బంగ్లాదేశ్ స్నేహ హ‌స్తం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన క్రీడా శాఖ మంత్రి

బంగ్లాదేశ్ : ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. నిన్న‌టి దాకా భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్విన బంగ్లాదేశ్ స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఆ దేశానికి నూత‌న ప్ర‌ధాన‌మంత్రి గా రెహ‌మాన్ కొలువు తీరారు. ఆయ‌న‌తో పాటు కొత్త మంత్రివ‌ర్గం ప్ర‌మాణ స్వీకారం చేసింది. ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్రమానికి భార‌త దేశం త‌ర‌పున స్పీక‌ర్ ఓం బిర్లా హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా బంగ్లాదేశ్ కు చెందిన కొత్త‌గా కొలువు తీరిన క్రీడా శాఖ మంత్రి . టి20 ప్రపంచ కప్ డ్రామా తర్వాత భారతదేశం పట్ల స్నేహపూర్వక హస్తం చాచారు, సంబంధాలను చక్క దిద్దు కోవాలని చూస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఇలా అన్నారు. పార్లమెంటు భవనంలో భారత డిప్యూటీ హైకమిషనర్‌ను కలిశాను. ఈ విషయం (T20 ప్రపంచ కప్ సమస్య) గురించి నేను అతనితో చర్చించాను, అతను చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడు . మన పొరుగు దేశాలన్నింటితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నందున చర్చల ద్వారా ఈ సమస్యను త్వరగా పరిష్కరించు కోవాల‌ని స్ప‌ష్టం చేశాన‌ని తెలిపారు. క్రీడల నుండి అన్ని ఇతర రంగాల వరకు ఇదే ఒర‌వడి కొన‌సాగించాల‌ని నిర్ణ‌యిం తీసుకున్నామ‌న్నారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *