హెరిటేజ్ పై వైసీపీ బుర‌ద చ‌ల్లితే ఎలా..?

నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వాలను అడ్డం పెట్టుకుని చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార లావాదేవీలు జరపకూడదని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వాల పేరుతో డబ్బులు దోచుకునే సంస్కృతి హెరిటేజ్‌ది కాదని స్ప‌ష్టం చేశారు శాస‌న స‌భ‌లో. గతంలో ప్రభుత్వ ధనాన్ని భార‌తి సిమెంట్ పేరుతో దోచుకున్న చరిత్ర వైసీపీకి మాత్రమే ఉందని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతల చర్యలు ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు.

గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్‌ను ఎలా అరికట్టామో అలాగే ఇప్పుడు కూడా ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలనే ప్రయత్నాలను సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చీని తోటలు కట్ చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం వంటి పాత పద్ధతులే ఇప్పుడు సంస్థలపై బదనాం చేయడంగా మారాయని మండి పడ్డారు. సభను ఇబ్బందికి గురి చేయడం సరికాదని అన్నారు. శాస‌న మండలిలో ప్రతిరోజూ ఒకే అంశాన్ని తీసుకొచ్చి వాయిదా తీర్మానాలతో సభను ఇబ్బందికి గురి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి హెచ్చరించారు. ఆధారాలుంటే టేబుల్‌పై పెట్టండి, లేదంటే అసత్య ప్రచారం మానేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *