వ‌రుస విజ‌యాల‌పై సూర్య కుమార్ కామెంట్స్

VijayaBhaskar · February 19, 2026
Spread the love

సూప‌ర్ -8కి చేరుకోవ‌డం ఆనందంగా ఉంది

అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 మెగా టోర్నీలో వ‌రుస‌గా భార‌త జ‌ట్టు విజ‌యాలు సాధించ‌డం ప‌ట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు టీమిండియా స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్. చాలా ఆనందంగా ఉంద‌న్నాడు. న‌మీబియా జ‌ట్టు కూడా బాగానే ఆడింద‌న్నాడు. త‌మ జ‌ట్టులో అంద‌రూ బాగానే ఆడుతున్నారని తెలిపాడు. త‌మ టీం సూప‌ర్ 8 చేరుకోవ‌డం సంతోషం క‌లిగించింద‌ని పేర్కొన్నాడు. ప్ర‌తి టీం బాగానే ఆడుతోంద‌ని చెప్పాడు . వారు అత్యుత్తమ క్రికెట్ ఆడటం ద్వారా సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించారని తెలిపాడు. మా గ్రూప్‌లో, వెస్టిండీస్, జింబాబ్వే , దక్షిణాఫ్రికా అన్నీ అద్భుతమైన జట్లు అని ప్ర‌శంస‌లు కురిపించాడు సూర్య కుమార్ యాద‌వ్.

వాటిలో ప్రతి ఒక్కటి వారి వారి గ్రూపులలోని అన్ని మ్యాచ్‌లను గెలుచుకున్నాయని పేర్కొన్నాడు. అందుకే తాము ఏ జ‌ట్టునూ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం లేద్నాడు సూర్య కుమార్ యాద‌వ్. ఏ మ్యాచ్ ను తేలిక‌గా తీసుకోవ‌ద్దంటూ ఇప్ప‌టికే డ్రెస్సింగ్ రూములో ఆట‌గాళ్ల‌కు చెప్ప‌డం జ‌రిగింద‌న్నాడు . మేము ఇక్కడ నుండి మ్యాచ్ తర్వాత మ్యాచ్ ముందుకు సాగాలని కృత నిశ్చ‌యంతో ఉన్నామ‌న్నాడు. మా తదుపరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఉంద‌న్నాడు. ఆ జ‌ట్టును త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌బోవ‌డం లేద‌న్నాడు.
ఆ జ‌ట్టుతో త‌ల‌ప‌డేందుకు తాము స‌ర్వ శ‌క్తులు ఒడ్డేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నాడు.