పేలుడు ఘ‌ట‌న‌పై కార్మిక శాఖ మంత్రి దిగ్భ్రాంతి

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన వాసంశెట్టి సుభాష్
అమ‌రావ‌తి : కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలోని బాణసంచా కర్మాగారంలో శ‌నివారం జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు
గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అగ్నిమాపక సిబ్బంది , రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వాసం శెట్టి సుభాష్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు .|ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని వెంటనే అందిస్తామని కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్‌ హామీ ఇచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *