జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌పై బీఆర్ఎస్ ఫోక‌స్

కీల‌క స‌మీక్ష చేప‌ట్టిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించిన లేవనెత్తాల్సిన అంశాలు వంటి వాటిని విస్తృతంగా కేటీఆర్ చర్చించారు. పార్టీ పరంగా అటు ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటానికి సంబంధించిన అంశంలో కేటీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా సమన్వయం, ఫాలోఅప్ బాధ్యతలను నాయకులకు కేటీఆర్ అప్పగించారు.

హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ ( జీహెచ్ఎంసీ)కి ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. మల్కాజిగిరి కార్పొరేషన్‌కు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుకు బాధ్యతలు అప్పగించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *