ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌రైన సీఎం

కోవిడ్ స‌మ‌యంలో రూల్స్ పాటించ‌ని రేవంత్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌ర‌య్యారు. 2021లో కోవిడ్ నియమాలను పాటించకుండా పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. 2019లో హుజుర్ నగర్ బై ఎలక్షన్లో అభ్యర్థి తరపున 40 కార్లు, డీజే సౌండ్స్‌తో ర్యాలీ చేప‌ట్టారు. అప్పటి ఎంపీలుగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు. దీంతో ఈసీ రూల్స్ కు విరుద్దంగా వీరు వ్య‌వ‌హ‌రించారంటూ ఎన్నిక‌ల సంఘం అధికారులు సీఎంపై, ఇత‌రుల‌పై ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు అక్క‌డి పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ కేసుల‌కు సంబంధించి ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఇందులో భాగంగా త‌ను ఒక‌ప్పుడు ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం సీఎం హోదాలో ఉన్నారు రేవంత్ రెడ్డి. భారీ భ‌ద్ర‌త న‌డుమ నాంప‌ల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఈ కేసుకు సంబంధించి జ‌డ్జి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు సీఎంను ఉద్దేశించి. కోర్టులో విచార‌ణ అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను చ‌ట్టానికి లోబ‌డి ఉండాల‌ని కోరుకుంటాన‌ని, అలాగే వ్య‌వ‌హ‌రిస్తాన‌ని తెలిపాడు. కేసులో భాగంగా విచార‌ణకు సంబంధించి హాజ‌రైన‌ట్లు తెలిపారు సీఎం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *