సంజు శాంస‌న్ ను 14 ఏళ్ల నుంచి చూస్తున్నా

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ శ‌శి థ‌రూర్

కేర‌ళ : తిరువ‌నంతపురం కాంగ్రెస్ పార్టీకి చెంద‌ని ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మ‌రోసారి కేర‌ళ‌స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ప్ర‌స్తావించాడు. త‌ను శాంస‌న్ ను 14 ఏళ్ల వయసులో త్రివేండ్రంలోని ఒక క్లబ్ తరఫున ఆడుతున్నప్పుడు చూశాన‌ని తెలిపాడు. ఆ స‌మ‌యంలో త‌న‌లో ఏదో స్పార్క్ ఉంద‌ని గుర్తించాన‌ని పేర్కొన్నాడు ఎంపీ. అంత‌టితో ఆగ‌క తాను వెళ్లి శాంస‌న్ ను వ్య‌క్తిగ‌తంగా క‌లిశాన‌ని, త‌న‌ను అభినందించాన‌ని చెప్పాడు. ఆనాటి నుంచి నేటి దాకా శాంస‌న్ పై ఓ క‌న్నేసి ఉంచాన‌ని వెల్ల‌డించారు శ‌శి థ‌రూర్.

అంతే కాదు తాను అతని కెరీర్‌ను మొదటి నుండి చూస్తూ వ‌చ్చాన‌ని తెలిపాడు. తాను ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ తాను సంజుకి పెద్ద అభిమానినని పేర్కొన్నాడు ఎంపీ. అతని విలువను నిరూపించు కోవడానికి అతనికి ఎప్పుడూ చాలా కాలం పాటు అవకాశం ఇవ్వలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. కానీ ఇవాళ 11 ఏళ్ల త‌ర్వాత తాను అనుకున్నది సాధించాడ‌ని, తాను ఏమిటో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశాడ‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. ఒక‌వేళ ఆ స్థానంలో ఎవ‌రు ఉన్నా అంత గొప్ప‌గా ఆడ‌లేక పోయి ఉండేవార‌ని త‌న అబిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు శశి థరూర్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *