ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక పై ఫోక‌స్

ప్ర‌జా భ‌వ‌న్ లో కీల‌క స‌మావేశం

హైద‌రాబాద్ : రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో హైదరాబాద్ జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్ , జీహెచ్ ఎంసీ కమిషనర్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అధికారులతో , సహచర మంత్రి అజారుద్దీన్ గారి తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో మార్చ్ 6 నుండి జూన్12 వరకు జరగనున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో చేయాల్సిన అంశాల పై దిశా నిర్దేశం చేశారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్.

99 రోజుల ప్రణాళిక లో బాగంగా హైదరాబాద్ జిల్లాలో పరిసరాల పరిశుభ్రత , ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ పరిష్కరణ, ఆరోగ్యం ,సురక్షితంగా చేరుకోవడం భద్రత, సంక్షేమం ,పిల్లల భద్రత, రక్షణ డ్రగ్స్ కి నో ,విద్య, యువత , క్రీడలు , మహిళలు , పర్యావరణం అంశాలపై మండల, నియోజకవర్గ జిల్లా స్థాయి అంశాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇదిలా ఉండ‌గా త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం బ‌డుగు, బ‌ల‌హీన‌, పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎంత‌గానో కృషి చేస్తోంద‌ని చెప్పారు. అందుకే ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని మెజారిటీ ఇచ్చార‌ని , వారికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులు : సీఎం

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం అని తెలిపారు. ఇప్పటికే రూ.రూ.11.37 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమైన‌ట్లు పేర్కొన్నారు. పీపీపీ…

    తెలుగుజాతి గర్వించేలా అమరావతి : సవిత

    అమరావతి : తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత తెలిపారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ ఆనాడు అమరావతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *