టీం ఇండియా విజ‌యం సంచ‌ల‌నం

ప్ర‌శంస‌లు కురిపించ‌చిన షోయ‌బ్ అఖ్త‌ర్

పాకిస్తాన్ : పాకిస్తాన్ స్టార్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అఖ్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అనూహ్యంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ లో ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ ను 96 ప‌రుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేత‌గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా ఇండియాతో పాటు ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌కు చెందిన క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెట‌ర్లు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా సోమ‌వారం మీడియాతో మాట్లాడాడు షోయ‌బ్ అఖ్త‌ర్ .

త‌ను భార‌త జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపాడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇండియా ప్ర‌త్యేకించి త‌యారు చేసిన‌ పాలసీ గెలిచింది, సిస్టమ్ గెలిచింది, మెరిట్ గెలిచింది అంటూ కొనియాడాడు. మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసినందుకు ప్ర‌త్యేకించి టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను కూడా ప్రశంసించాడు షోయ‌బ్ అఖ్త‌ర్. అంతేకాదు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి గౌరవం ఇస్తూ ముగ్గురు కెప్టెన్లు కలిసి సెలబ్రేట్ చేయడం గొప్ప విషయం అన్నాడు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *