జ‌నం ఆవేద‌న జ‌న‌సేనాని ఆలంబ‌న‌

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు ప‌వ‌న్ ప‌రిష్కారం

అమ‌రావ‌తి : మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారని, ప్రజల కోసం పని చేసే నాకు అలాంటి భయాలు లేవు అని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . మీ కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తానని అన్నారు. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తామ‌న్నారు. మాటా-మంతి కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ గ్రామ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించారు. ఓనూరు ప్రాథమిక పాఠశాలను స్వయంగా పరిశీలించారు. మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే ఓనూరు వెళ్లాలని నందిగరువు గ్రామస్థులు ఆవేద‌న చెందారు. వారి వేద‌న‌ను గుర్తించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట‌నే నందిగరువు గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు. వీబీ జీరామ్ జీ పథకం నిధులతో ఓనూరు – కొత్తపలం రోడ్డుకు అనుమతులు ఇచ్చారు. అలాగే కొత్తపలంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నర్తనపల్లి, ఓనూరు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైయిన్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి జల్ జీవన్ మిషన్ పథకం నిధులతో సమస్యను పరిష్కరిస్తాం అని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *