క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ను స‌త్క‌రించిన సీఎం

ప్ర‌భుత్వం త‌నకు అండ‌గా ఉంటుంద‌ని హామీ

హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ కు చెందిన ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిని క‌లిశారు. టి20 ప్రపంచ కప్-2026 లో భారత జట్టు విజయం సాధించడంలో త‌ను కూడా కీల‌క పాత్ర పోషించాడు. కీల‌క‌మైన స‌మ‌యంలో కొద్ది ప‌రుగులు చేసినా త‌ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా టీం ఇండియా ఆటగాడు తిలక్ వర్మ త‌న‌ను క‌లుసు కోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు సీఎం రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా తిలక్ వర్మను ఘ‌నంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో అద్భుతంగా ఆడాల‌ని ఆకాంక్షించారు. మ‌రిన్ని రికార్డులు న‌మోదు చేయాల‌ని కోరాడు. అటు దేశానికి ఇటు రాష్ట్రానికి పేరు తీసుకు రావాల‌ని కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, SATG చైర్మన్ శివసేనారెడ్డి , త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *