గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు

మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై స‌విత సెటైర్

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై సెటైర్ వేశారు. ఆయ‌న
గత ప్రభుత్వ హయాంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ చెప్పడం తప్ప చేసిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. ధర్మవరంలో హ్యండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ మోసగించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు తనవంతు కృషి చేశారని మంత్రి సవిత కొనియాడారు.

చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. 90 శాతం సబ్సిడీపై స్టాండ్ లూమ్స్ అందజేస్తున్నామని వెల్ల‌డించారు. ధర్మవరంలో చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఆప్కో షో రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, టీడీపీ ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన నాయకులు చిలకం మధుసూదన్, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు, చేనేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *