బడ్జెట్ లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయింపు

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు

హైదరాబాద్ : తెలంగాణ ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను క్రీడల్లో ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు గా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగ పడుతుందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.లక్ష్మయ్య ఆశాభావం వ్య‌క్తం చేశారు.

గతంలో స్వయంగా ఒక క్రీడాకారుడైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన హాయాంలో కూడా క్రీడలకు బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. క్రీడాకారులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘాల తరఫున ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి జిల్లాలో క్రీడలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించి స్పోర్ట్స్ స్కూల్స్ , స్పోర్ట్స్ హాస్టల్స్, స్పోర్ట్స్ అకాడమీలతో పాటు ఆయా క్రీడాంశాల్లో కోచ్ ల నియామకాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *