గేమ్ ఛేంజ‌ర్ కానున్న ఎన‌ర్జీ సెక్టార్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగం గేమ్ ఛేంజర్ కానుందని అన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది కాబట్టే కీలకమైన పరిశ్రమలు ఏపీకి వచ్చాయన్నారు. గూగుల్ వంటి సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల‌న్నారు.

వ్యవసాయ పంపు సెట్లకు పీఎం కుసుమ్ పథకం వినియోగించుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాల‌ని ఆదేశించారు సీఎం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో దక్షిణ భారత దేశంలో ఏపీనే ముందు వరుసలో ఉందన్నారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాల‌ని అన్నారు సీఎం. వీటితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం వంటి వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *