మా భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీకి క‌ట్ట‌బెట్టారు

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన దానం నాగేంద‌ర్

హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ శాస‌న స‌భ వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న నేరుగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిప్పులు చెరిగారు.
తన తండ్రి కష్టపడి సంపాదించిన సొంత భూమిని కేటీఆర్ అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో భయం వల్ల మౌనంగా ఉన్నామని అన్నారు. కానీ ఇప్పుడు ఆ బెరుకు పోయింద‌న్నారు ఎమ్మెల్యే.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ స‌ర్కార్ కు ఈ మొత్తం భూమి క‌బ్జా సంఘ‌ట‌న‌కు సంబందించి సమ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకు గాను వెంట‌నే కేబినెట్ స్పందించాల‌ని, త‌క్ష‌ణ‌మే హౌస్ కమిటీ వేయాలని దానం డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను సభ ముందు ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు. దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదంతా బ‌క్వాస్ అంటూ కొట్టి పారేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *