300ల గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

కాలువ‌ను క‌బ్జా చేసి ప్లాట్లుగా విక్ర‌యించిన వైనం
హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌బ్జాదారులకు చుక్క‌లు చూపిస్తోంది హైడ్రా. క‌బ్జాదారులు, భూ అక్ర‌మార్కుల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా జూబ్లీహిల్స్‌లో గ‌జం స్థ‌లం కొనాలంటే రూ. 2 ల‌క్ష‌లు పెట్టాల్సిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ సొసైటీకి గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన వారు వ‌ర‌ద కాలువ‌లున్నా ప‌ట్టించు కోకుండా ప్లాట్లుగా సృష్టించారు. 120 గ‌జాల ఓ ప్లాట్‌, 180 గ‌జాల‌తో మ‌రో ప్లాట్ సృష్టించి అమ్మేశారు. స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ‌లో రిజిస్ట్రేష‌న్ కూడా అయ్యాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఓ ప్లాట్ య‌జ‌మాని ఇదే విష‌యాన్ని హైడ్రా ప్ర‌జావాణిలో పిర్యాదు చేశారు. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు జీహెచ్ ఎంసీ అధికారుల‌తో పాటు సంబంధిత శాఖ‌ల‌తో క‌లిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది.

మాధాపూర్ మెట్రో స్టేష‌న్ నుంచి వ‌చ్చే వ‌ర‌ద కాలువతో పాటు.. జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ‌గుడి వైపు నుంచి వ‌చ్చే మ‌రో వ‌ర‌ద కాలువ బాక్స్ డ్రైన్లుగా ఉన్నాయి. బాక్సు డ్రైన్లు ఉంటుండ‌గా.. పైన నిర్మాణాలు చేసేద్దామ‌ని ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు వెల్ల‌డైంది. టిన్ షీట్స్‌తో ప్ర‌హ‌రీలు నిర్మించి.. లోప‌ల వాచ్‌మ్యాన్‌కు గ‌దులు నిర్మించ‌గా.. వాటిని హైడ్రా రంగంలోకి దిగింది. వీటిని తొల‌గించింది. 300ల గ‌జాల స్థ‌లాన్ని కాపాడ‌డ‌మే కాకుండా.. వ‌ర‌ద కాలువ‌ల‌ను ప‌రిర‌క్షించినందుకు హైడ్రాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు న‌గ‌ర వాసులు .

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *