మహేష్‌ బాబుకు యుఫోరియా తెగ న‌చ్చేసింది

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్

హైద‌రాబాద్ : తెలుగు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా త‌ను సామాజిక స‌మ‌స్య‌ను ప్ర‌స్తావిస్తూ యుఫోరియా అనే పేరుతో మూవీ తీశాడు. ఇది క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ కాలేదు. కానీ ప‌లువురు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది. ఈ త‌రుణంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు యుఫోరియాపై తాజాగా స్పందించాడు. ఆపై సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఈ సినిమా గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తూ పేర్కొన‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.

తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తార‌ని అనుకోలేద‌న్నాడు.
అయితే మహేష్ బాబు సినిమా చూడాలని తాను అడగలేదని అన్నారు. ఆయన స్వయంగా సినిమా చూసి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారని తెలిపారు. కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన మహేష్ బాబు వంటి స్టార్‌కు తన సినిమా నచ్చడం ‘కనకవర్షం’తో సమానమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండ‌గా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు , భూమిక న‌టించారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన మూవీ ఒక్క‌డు. ఇది తెలుగు సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపింది. కాసుల వ‌ర్షం కురిపించింది. త‌న‌లోని న‌టుడిని మేల్కొల్పేలా చేశాడు గుణ శేఖ‌ర్ .

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *