నితీశ్ కుమార్ కు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ

ఇటీవ‌లే సీఎం ప‌ద‌వి రాజీనామా

బీహార్ : దేశ రాజ‌కీయాల‌లో సుదీర్ఘ‌మైన పాల‌నా అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందాడు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా త‌ను ఎన్డీయే కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరనున్నారు. దీంతో త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఇటీవ‌లే రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం జేడీయు అధ్య‌క్షుడిగా ఉన్నారు నితీశ్ కుమార్. ఆయ‌న త్వరలో పార్లమెంటుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని త్యజించాల్సి వ‌చ్చింది.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు జెడ్ ప్ల‌స్ భద్రత కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేష‌న్ కూడా పేర్కొంది స‌ర్కార్. మార్చి 16న రాజ్యసభకు ఎన్నికైన కుమార్, ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న సభ్యుల పదవీకాలం ముగిసిన తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం రాష్ట్ర హోం శాఖ కీల‌క నోటిఫికేష‌న్ జారీ చేసింది సెక్యూరిటీ గురించి. నితీష్ కుమార్ రాజ్యసభలో ప్రవేశించిన తర్వాత జెడ్ ప్ల‌స్ స్థాయి భ‌ద్ర‌త‌ను పొందుతారు. కుమార్ రాష్ట్రంలోని ‘బీహార్ ప్రత్యేక భద్రతా చట్టం, 2000’ కింద కల్పించబడిన ప్రత్యేక భద్రతను అనుభవించారు. ఈ చట్టం ప్రధానమంత్రి కోసం ఉద్దేశించిన ఎస్పీజీ నమూనాలో రూపొందించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *