ధ‌రుంధ‌ర్ -2 రికార్డ్ రూ. 1500 కోట్లు వ‌సూలు

VijayaBhaskar · April 3, 2026
Spread the love

కేవ‌లం 15 రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌లెక్ష‌న్స్

ముంబై : ఆదిత్య ధ‌ర్ దర్శ‌క‌త్వంలో మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ధురంధ‌ర్ -2 సీక్వెల్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఆశించిన దానికంటే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించింది. విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించింది. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ కేవ‌లం 15 రోజుల్లోనే రూ. 1500 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. విస్తు పోయేలా చేసింది. దురంధ‌ర్ -1 ఏకంగా రూ. 12000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. కేవ‌లం మూడు నెల‌ల కాలంలోనే తిరిగి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ సీక్వెల్ మూవీ.

ఇక ఈ చిత్రం ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిందీ ఓపెనర్ గా నిలిచింది. అత్యధిక మొదటి, రెండవ వారం వసూళ్లు చేసి రికార్డ్ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ గా ఉండ‌డం కూడా ఓ రికార్డే. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1,000 కోట్లు వసూలు చేసిన అత్యంత వేగవంతమైన చిత్రం వంటి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రణవీర్ సింగ్, సారా అర్జున్ , సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇదిలా ఉండ‌గా ప్రపంచంగా ధురంధ‌ర్ -2 మూవీ బాక్సాఫీస్‌ను కుదిపేసిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. జియో స్టూడియోస్ , బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు ధురంధ‌ర్ -2 మూవీని.