కేర‌ళ‌ను విమ‌ర్శించే హ‌క్కు రేవంత్ రెడ్డికి లేదు

నిప్పులు చెరిగిన సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్

కేర‌ళ : త‌న‌తో పాటు కేర‌ళ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్. ఇటీవ‌ల కేరళ గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవ‌ని కొట్టి పారేశారు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించే వ్యక్తి, కేరళకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉంద‌న్నారు. మా సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నమూనాను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులకు ఆయన కేవలం ఒక ప్రతినిధిగా మారిపోయారని పేర్కొన్నారు సీఎం.

విచిత్రం ఏమిటంటే కేరళ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏదో ఒక బంధం ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు సీఎం. ఆయన చేసిన ఆరోపణ హాస్యాస్పదం అని పేర్కొన్నారు. కేరళ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం ఆర్థిక దిగ్బంధం, రుణ పరిమితి కోతలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడ లేకపోయిన, వెన్నెముక లేని కాంగ్రెస్ పార్టీయే నిజానికి బీజేపీకి అసలైన ‘బి-టీమ్’లా వ్యవహరిస్తోందని ఆరోపించారు పిన‌య‌ర్ విజ‌య‌న్. ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కేరళ చేసిన తీవ్ర నిరసనలను ఆయన గమనించలేదా? లేక మన రాష్ట్రానికి తన పార్టీ చేసిన ద్రోహాన్ని ఆయన సమర్థించు కుంటున్నారా? అని ప్ర‌శ్నించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *