రాణించ‌లేక పోయాం అందుకే ఓడిపోయాం

పంజాబ్ చేతిలో ఓట‌మిపై రుతురాజ్ గైక్వాడ్

చెన్నై : ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశించిన మేర రాణించ‌డం లేదు. తొలి మ్యాచ్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో ఓట‌మి పాలైంది. అనంత‌రం రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చేతిలో ప‌రాజయం పొందింది. ప్ర‌ధానంగా భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజూ శాంస‌న్ ఆశించిన మేర రాణించ‌లేదు. త‌న పూర్ ప‌ర్ ఫార్మెన్స్ జ‌ట్టుపై ప‌డుతోంది. ఈ త‌రుణంలో పంజాబ్ చేతిలో ఓట‌మి అనంత‌రం సీఎస్కే కెప్టెన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

త‌ను మీడియాతో మాట్లాడారు. గత రెండు మ్యాచ్‌లలో మేము అస్సలు బాగా ఆడలేదని ఒప్పుకున్నాడు. చాలా పేలవమైన క్రికెట్ ఆడామన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఓటమి మాకు ఎంతో అవమానకరమైనది అని పేర్కొన్నాడు. ఒక జట్టుగా, తదుపరి మ్యాచ్ నుండే మేము తప్పక పుంజు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు రుతురాజ్ గైక్వాడ్. జ‌ట్టులో స‌మ‌న్వ‌యం కొర‌వ‌డింద‌ని వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను కొట్టి పారేశాడు. ఎంఎస్ ధోనీ సార‌థ్యంలోని జ‌ట్టు బ‌లంగా ఉంద‌న్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *