newsseals.com
DEVOTIONAL

శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు

VijayaBhaskar April 5, 2026
neewsseals-PushpaYagam
Spread the love

ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప యాగం నిర్వ‌హ‌ణ

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల‌లో తిరుప‌తిలోని ప్రసిద్ద ఆల‌యం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఉత్స‌వాలలో భాగంగా ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తార‌ని పేర్కొంది. ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుందని తెలిపింది. రాత్రి 7 గంట‌లకు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తార‌ని పేర్కొంది టీటీడీ

ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌కు భారీ ఎత్తున భ‌క్త బాంధ‌వులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేసింది. ఈ మేర‌కు టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపింది. కాగా ఉత్స‌వాలను తిలకించేందుకు వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది టీటీడీ.