సింగ‌రేణిని ప‌ట్టించుకోని కాంగ్రెస్ స‌ర్కార్

క‌న్నెర్ర చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో ఇప్పుడు కూడా అలాగే పరిస్థితులు ఉన్నాయ‌ని ఆవేద‌న చెందారు. అప్పుడు మన తెలంగాణ వాళ్లు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయి అంటూ వెళ్లేవారని పేర్కొన్నారు. మనకు తినటానికి తిండి లేని సమయంలో కార్మికులకు తిండి పెట్టిన సింగరేణిని మనం సిరులవేణి అని తలుచుకుంటాం అని గుర్తు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి సింగరేణితో ఎలాంటి భావోద్వేగం లేదని వాపోయారు అందుకే కార్మికుల సమస్యలు వారికి తెలియటం లేద‌న్నారు.

సింగరేణి లో నుంచి బొగ్గు తీసేందుకు కార్మికులు ప్రాణాలను ఫణంగా పెడుతున్నార‌ని, అక్కడి గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బ్లాక్ అవుతుంద‌ని, కాళ్లు వంకర అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు.
ఈ విషయం ఏమాత్రం తెలియని ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండటంతో వారికి మన కష్టాలు తెలియటం లేదన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కొంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయాం. అందుకే కొన్ని సడలింపులు ఇచ్చుకొని 20 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *