పున‌రుత్పాద‌క ఇంధ‌న కేంద్రంగా రాయ‌ల‌సీమ‌

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : రాయలసీమను ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాల‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రాజెక్టుల భద్రత, సకాలంలో అమలును నిర్ధారిస్తూనే, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తయారీ, సుస్థిర పారిశ్రామిక వృద్ధిలో అగ్రగామిగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందనిపునరుద్ఘాటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగ‌ళ‌వారం సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశానికి అధ్యక్షత వహించారు.

రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా పటిష్టమైన ట్రాన్స్‌మిషన్ మౌలిక సదుపాయాలను ప్రణాళిక చేసి, అభివృద్ధి చేయాలని అన్నారు. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్ సహా పలు రంగాలలో మొత్తం రూ. 39,436.84 కోట్ల పెట్టుబడితో 31 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 1,11,278 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు సీఎం. రాయలసీమలో సోలార్ పార్కులను అభివృద్ధి చేసి, తదనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *