రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెర‌గాలి

పిలుపునిచ్చిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల‌లో మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. మ‌రింత పెద్ద ఎత్తున భాగ‌స్వామ్యం క‌లిగి ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. FICCI FLO ఆధ్వర్యంలో YFLO ఢిల్లీలో రాజకీయాలు, నాయకత్వం , వ్యక్తిగత ప్రయాణాలపై ఒక ఆలోచనాత్మక సంభాషణలో పాల్గొన్నారు ఎంపీ రాఘవ్ చ‌ద్దా. ఈ చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దంగా జ‌రిగాయి. యువ‌త ఎక్కువ‌గా పాల్గొన్నారు. ప్ర‌తి ఒక్క‌రు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా.

YFLO ఢిల్లీ అనేది విభిన్న వృత్తులు, వ్యవస్థాపక నేపథ్యాల నుండి వచ్చిన యువతులు నేర్చుకోవడానికి, నాయకత్వం వహించడానికి ,ఎదగడానికి ఒకచోట చేర్చే ఒక వేదిక కావ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు ఎంపీ. అన్నింటికన్నా ముఖ్యంగా, తమ సొంత మార్గాలను రూపొందించుకుంటున్న చైతన్య వంతమైన మహిళలతో నిండిన గదిలో సంభాషించడం స్ఫూర్తి దాయకంగా ఉందని పేర్కొన్నారు. దేశాన్ని మార్చే శ‌క్తి, స‌త్తా మ‌హిళ‌ల్లో ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు రాఘ‌వ్ చ‌ద్దా. రాజ‌కీయాలు క‌లుషిత‌మై పోయాయ‌ని కామెంట్స్ చేసేకంటే ముందు మ‌నం కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు ఉత్సుక‌త చూపించాల‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *