మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి

స్ప‌ష్టం చేసిన బెజ‌వాడ‌ ఎంపీ కేశినేని నాని

విజ‌య‌వాడ :తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే తొలి ముఖద్వారం జగ్గయ్యపేట పట్టణం అని, దీనిని అన్ని రంగాల‌లో అగ్ర‌గామిగా నిలిపేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని. ఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జగ్గయ్యపేటను అన్ని రంగాల‌లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని చెప్పారు.

మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, సచివాలయ సిబ్బందితో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్ తో కలిసి పాల్గొన్నారు ఎంపీ. రాబోయే 40 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, తాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్ర‌క‌టించారు. జగ్గయ్యపేటను అమరావతి పరిధిలో తొలి పారిశ్రామిక పట్టణంగా తీర్చిదిద్దుతూ, త్వరలోనే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని తెలిపారు.

విజయవాడ–హైదరాబాద్ ప్యాసింజర్ రైలు కోసం కృషి చేస్తున్నాం అని చెప్పారు ఎంపీ. మహిళల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఆర్థిక సాధికారతకు తోడ్పడతాం అన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, జగ్గయ్యపేటను ఆదర్శ పట్టణంగా మారుస్తాం అని చెప్పారు ఎంపీ.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *