రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేష్ భేటీ

అమ‌రావ‌తి బిల్లు ఆమోదించినందుకు కంగ్రాట్స్

న్యూఢిల్లీ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. సోమ‌వారం ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాజ‌ధానిగా అమ‌రావ‌తి బిల్లుపై సంత‌కం చేసినందుకు ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంత‌కు ముందు ముర్మును ఘ‌నంగా స‌న్మానించారు నారా లోకేష్. మంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఏపీకి చెంద‌ని పార్ల‌మెంట్ స‌భ్యులు కూడా హాజ‌ర‌య్యారు.

అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీలు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముకు లోకేష్ వివరించారు. ప్రెసిడెంట్ ను క‌లిసిన అనంత‌రం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను రాజ‌ధాని పేరుతో మోసం చేసింద‌ని అన్నారు. కానీ ఎప్పుడైతే కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిందో ఇచ్చిన మాట నిల‌బెట్టు కోవ‌డం జ‌రిగింద‌న్నారు లోకేష్‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *