న‌వ్వుల‌పాలు కాకుండా బ‌తికిన‌ ఎంఎస్

నవ్వడం తెలిసిన అరుదైన న‌టుడు

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అరుదైన న‌టుడు ఎంఎస్ నారాయ‌ణ‌. ఏప్రిల్ 16 ఆయన జ‌యంతి. ఈ సంద‌ర్బంగా మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఎంఎస్ న‌టుడు మాత్ర‌మే కాదు అరుదైన వ్య‌క్తి అని పేర్కొన్నారు. నవ్వించ గలిగినవాడు,
నవ్వుల పాలు కాకుండా బ్రతికిన వాడు , మంచి వాడు, మ‌న వాడు అంటూ కితాబు ఇచ్చారు. ఆయ‌న‌ను గుర్తు చేసుకున్నారు. ఎం.ఎస్. నారాయణ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడిగా వెలుగొందారు. ఆయన తన ప్రత్యేకమైన హాస్య శైలితో ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలు నవ్వించారు.

ఎంఎస్ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. 16 ఏప్రిల్ 1951 లో పుట్టారు. వృత్తి ప‌రంగా నటుడు, దర్శకుడు, రచయితగా గుర్తింపు పొందారు. ఎం.ఎస్. నారాయణ మొదట తెలుగు లెక్చరర్‌గా పని చేశారు. తరువాత సినిమాలపై ఆసక్తితో సినీ రంగంలోకి వచ్చారు. ఆయన కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు చేశారు. కానీ తరువాత హాస్యనటుడిగా భారీ గుర్తింపు పొందారు. ఎంఎస్ 700కి పైగా సినిమాల్లో నటించారు. వాటిలో దూకుడు, బాద్ షా, దుబాయ్ శ్రీ‌ను, కింగ్, రెడీ సినిమాలు చాలా గుర్తింపు తీసుకు వ‌చ్చేలా చేశాయి. తన డ్రంక్ కామెడీ పాత్రలు చాలా ప్రసిద్ధి చెందాయి . చాలా సినిమాల్లో లెక్చరర్, పోలీస్, పూజారి వంటి పాత్రల్లో కనిపించారు.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *