రేణిగుంట‌లో రూ. 20 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత

నిర్వీర్యం చేసిన తిరుప‌తి పోలీసులు

తిరుప‌తి జిల్లా : తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు సారధ్యం లోని పోలీసులు దూకుడు పెంచారు. జిల్లాలో భారీ గంజాయి స్కాంను బ‌ట్ట బ‌య‌లు చేశారు. ఈ సంఘ‌ట‌న జిల్లాలోని రేణిగుంట‌లో చోటు చేసుకుంది. వివ‌రాల లోకి వెళితే రేణిగుంటలో రూ. 20 కోట్ల విలువైన 4,100 కిలోల గంజాయిని నిర్వీర్యం చేశారు తిరుప‌తి పోలీసులు. ఈ సంద‌ర్బంగా స్పందించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. తిరుపతి పోలీసు యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు .

ఎస్పీ సుబ్బారాయుడు , కలెక్టర్ వెంకటేశ్వర్లు సంయుక్త‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమర్థవంతమైన చర్య, మాదకద్రవ్యాల పట్ల మా ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో తెలియ జేస్తోందని అన్నారు హోం శాఖ మంత్రి. ​డ్రగ్స్ మాఫియాకు ఇది నా హెచ్చరిక – చట్టం పంజా నుంచి మీరు తప్పించు కోవడం అసాధ్యం అని అన్నారు. ఇకపై రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను మూలలతో సహా పెకిలించి వేసేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌న్నారు.

మన యువత బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం సాగిస్తున్న ఈ పోరాటం నిరంతరం కొనసాగు తుంద‌న్నారు. ‘డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల‌ని కోరారు వంగ‌ల‌పూడి అనిత‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *