మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం

స‌మీక్ష చేప‌ట్టిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తీపి క‌బురు చెప్పారు. ఇవాళ స‌చివాల‌యంలో త‌న కార్యాల‌యంలో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు ఉన్న‌తాధికారుల‌కు. త‌మ రాష్ట్రం భూములు ఇచ్చేందుకు సిద్దంగా ఉంద‌న్నారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శరవేగంగా అడుగులు ప‌డ‌నున్నాయి. అంతే కాకుండా కేవ‌లం రాబోయే రెండు నెల‌ల కాలంలో వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఇప్ప‌టికే ప‌లు ఎక‌రాల‌ను సేక‌రించామ‌న్నారు మంత్రి. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 953 ఎకరాల భూమి సేకరించి కేంద్రానికి అప్పగించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టుల పైనా దృష్టి సారించామ‌న్నారు. ఇందుకు సంబంధించి యాక్ష‌న్ ప్లాన్ కూడా రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు.
ఈ సమావేశంలో ఏవియేషన్ డైరెక్టర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఈడీ పాల్గొన్నారు. మంత్రితో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *