ఆప‌రేష‌న్ స‌క్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రెస్ట్

వెల్ల‌డించిన జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం

అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనా పరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు.

వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించారు. ఈ మేర‌కు వెంట‌నే శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో అభిమానులు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. పార్టీ కార్యాల‌యం ఏపీ డిప్యూటీ సీఎం ఆరోగ్య ప‌రిస్థితిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *