పెమ్మ‌సానికి అంత సీన్ లేదు : అంబ‌టి రాంబాబు

హత్యా రాజ‌కీయాల‌కు తెర లేపిన కేంద్ర మంత్రి

అమ‌రావ‌తి : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుంటూరు జిల్లాలో హ‌త్యా రాజ‌కీయాల‌కు తెర లేపారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పెమ్మసాని కొత్త పిచ్చోడు పొద్దెరుగ‌డంటూ మండిప‌డ్డారు. ఇక‌నైనా త‌ను ప‌ద్ద‌తి మార్చు కోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ప్రతిరోజు పండుగ లాగా ఉండద‌ని, రెండు రోజుల తర్వాత మా పండగ వస్తుందని గుర్తు పెట్టుకోవాల‌న్నారు అంబ‌టి రాంబాబు.

తెలుగుదేశం కార్యకర్తలు ఒకటి గుర్తు పెట్టుకోండి రేపు ఓడిపోతే పెమ్మసాని ఫ్లైట్ వేసుకుని అమెరికా వెళ్ళి పోతాడంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి. తాను ఊరుకున్నా రేప‌టి రోజున తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంద‌న్నారు. నారా లోకేష్ , సీఎం చంద్ర‌బాబు అండ చూసుకుని పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ రెచ్చి పోతున్నార‌ని, ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు అంబ‌టి రాంబాబు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *