చ‌ర్చిలో మోకాళ్ల‌పై న‌డిచిన టీవీకే విజ‌య్

ఎన్నిక‌ల వేళ న‌టుడు సంచ‌ల‌నం

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ప్ర‌ముఖ న‌టుడు టీవీకే విజ‌య్ సంచ‌ల‌నంగా మారారు. ఈసారి ఎన్నిక‌ల‌లో ఆయ‌న ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు. అంద‌రి క‌ళ్లు త‌న పార్టీ పైనే ఉన్నాయి. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్నారు న‌టుడు విజ‌య్. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌వుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విజ‌య్ త‌మిళ‌నాడులోని తిరుచ్చిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా విజ‌య్ ప్ర‌ముఖ సెయింట్ ఆంటోని చ‌ర్చిని సంద‌ర్శించారు. అక్క‌డ చ‌ర్చిలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. చర్చిలో మోకాళ్లపై నడిచారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి సోష‌ల్ మీడియాను. ఆయ‌న ప్ర‌చారంలో కొత్త పుంత‌లు తొక్కిస్తున్నారు. అన్ని పార్టీల కంటే ప్ర‌చారంలో ముందంజ‌లో ఉన్నారు. అంతే కాదు రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపారు. ఇత‌ర పార్టీల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీతో పాటు ఎన్డీయే కూట‌మికి చెందిన అన్నాడీఎంకేతో పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *