లౌకిక వాదానికి నియంతృత్వానికి మ‌ధ్య పోటీ

నిప్పులు చెరిగిన ఏఐసీసీ జీఎస్ కేసీ వేణుగోపాల్

త‌మిళ‌నాడు : ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడులో ఈనెల 23న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇండియా కూట‌మి త‌ర‌పున పాల్గొని ప్ర‌సంగించారు . ఈ ఎన్నికలు వాస్తవానికి తమిళ సంస్కృతి, లౌకికవాద భావజాలానికి, ప్రధాని మోదీ విభజనవాద, నియంతృత్వ పాలనకు మధ్య జరుగుతున్నవని స్ప‌ష్టం చేశారు. బీజేపీ మొత్తం ఎన్నికలను హైజాక్ చేయాలని చూస్తోందని ఆరోపించారు.

అందుకోసం వారు ఏఐఏడీఎంకేను ఒక ఆయుధంగా ఎంచుకున్నారని మండిప‌డ్డారు కేసీ వేణుగోపాల్. వారు తమిళనాడులో సీట్ల సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతిపక్షమంతా, భారత కూటమి, కాంగ్రెస్, డీఎంకే కలిసి పోరాడి వారిని ఓడించాయన్నారు. ఈ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి సునాయాసంగా గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు కేసీ వేణుగోపాల్ స్టాలిన్‌తో సంయుక్త సమావేశానికి హాజరయ్యారు.. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన మూడు స‌భ‌ల‌లో పాల్గొన్నారు. ఇండియా కూట‌మికి ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *