గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు

ఫ‌లించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యాలు

అమ‌రావ‌తి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం పనికి ఆహార పథకంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చే కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దారు. గోకులం షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణం ద్వారా పాడి రైతుకి అండగా నిలచారు. ఫారం పాండ్స్ నిర్మించి రైతుకి దిగుబడి సాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 375 కోట్లు కేటాయించి 21,567 గోకులం షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 15,000 నీటి తొట్టెలు, 1,06,788 ఫారం పాండ్స్ నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మస్టర్ల అవకతవకలకు చెక్ పెడుతూ సాంకేతికత సాయంతో ముఖ ఆధారిత గుర్తింపు ప్రక్రియ తీసుకువచ్చారు. స్వర్ణ పంచాయత్ పోర్టల్ ద్వారా పాలనలో పారదర్శకత పెరిగింది. ఈ పోర్టల్ ద్వారా రూ. 1,000 కోట్ల ఆదాయపు పన్ను నగదు రహత చెల్లింపులు జరగడమే అందుకు నిదర్శనం. అంతే కాదు 13,350 పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా తీర్చిదిద్దారు. పాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 77 డీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *