తాజా ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మిదే విజ‌యం

ధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఇండియా కూట‌మి త‌ర‌పున పెద్ద ఎత్తున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇండియా కూట‌మిలోని ఆయా పార్టీల అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేప‌ట్టారు. త‌మిళ‌నాడులో ఈనెల 23న పోలింగ్ ముగిసింది. మొత్తం 234 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ ముగిసింది. ప‌శ్చిమ బెంగాల్ లో రెండు విడ‌త‌లుగా పోలింగ్ జ‌ర‌గ‌నుంది. తొలి విడ‌త‌లో 16 జిల్లాల్లో 156 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ ముగిసింది. కొన్ని అల్ల‌ర్లు చోటు చేసుకున్నా పోలింగ్ ముగిసింది.

ఈ సంద‌ర్బంగా స్పందించాడు డీకే శివ‌కుమార్. మా ఎన్నికల ప్రక్రియ పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటక , అసోంలలో ఎన్నికలు ముగిశాయన్నాడు. నిన్న మేము అసోం నాయకులతో ఒక ‘జూమ్’ సమావేశాన్ని కూడా నిర్వహించ‌డం జ‌రిగింద‌ని తెలిపాడు డీకే శివ‌కుమార్. కేరళ, తమిళనాడులలో మా కూటమి భాగస్వామ్యంతో మేము 100% ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. త‌మ కూటమికి పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయని తెలిపాడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *