స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డాన్ని ఇష్ట ప‌డ‌తా

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సూర్య‌వంశీ

ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026లో దుమ్ము రేపుతున్నాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను పంజాబ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో దుమ్ము రేపాడు. కేవ‌లం 16 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 222 ర‌న్స్ చేసింది. అనంత‌రం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సునాయ‌శంగా గెలుపొందింది. వైభ‌వ్ తో పాటు పెరీరా, య‌శ‌స్వి జైస్వాల్ అద్భుత‌మైన ప‌ర్ ఫార్మెన్స్ చేయ‌డంతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఈ సంద‌ర్భంగా మ్యాచ్ అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ మీడియాతో మాట్లాడాడు.

ఈ రోజు మ్యాచ్ ఆడటానికి నేను నిజంగా చాలా ఉత్సాహ పడ్డాను. నిన్న రాత్రంతా నేను దీని గురించే చాలా ఆలోచిస్తూ గడిపాను. పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కోవడం చాలా సవాలుతో కూడుకున్నదని, కష్టంతో కూడిన పని అని నా చుట్టూ ఉన్నవారందరూ చెప్పారు. కానీ వాస్త‌వానికి కఠినమైన సవాళ్లను స్వీకరించడం, క్లిష్టమైన మ్యాచ్‌లు ఆడటం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు సూర్య‌వంశీ. అందుకే, ఈ రోజు ఎలాగైనా సరే మనం గెలవాలని నేను ముందే నిర్ణయించుకున్నానని చెప్పాడు. జట్టుకు ఒక మంచి ఆరంభాన్ని అందించినందుకు సంతోషంగా ఉంద‌న్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *