క‌విత‌తో మాజీ మంత్రి బోడ‌ జ‌నార్ద‌న్ భేటీ

త్వ‌ర‌లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లోకి

హైద‌రాబాద్ : మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లో చేరనున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా ఆయ‌న‌ కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని ప్ర‌క‌టించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడ జనార్దన్ ప్రస్తుత మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసన సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

అంతే కాకుండా ఎన్ టీ రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. గ‌తంలో టీడీపీలో కీల‌క‌మైన వ్య‌క్తిగా ఉన్నారు. అంతే కాకుండా కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా కూడా గ‌తంలో ప‌ని చేసిన అనుభ‌వం త‌న‌కు ఉంది. ప్ర‌స్తుతం ఏ పార్టీలో చేరేందుకు తాను ఇష్ట‌ప‌డ‌టం లేద‌న్నారు. అన్ని పార్టీలు ప్ర‌జ‌ల‌ను పట్టించు కోవడం మానేశాయ‌న్నారు. ప్ర‌స్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేవ‌లం హామీల పేరుతో జ‌నాన్ని మోసం చేస్తున్నాయ‌ని ఆరోపించారు బోడ జ‌నార్ద‌న్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *