సీఎంను క‌లిసిన శివ‌ధ‌ర్ రెడ్డి, సీవీ ఆనంద్

అభినందించిన అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులైన బి. శివధర్ రెడ్డి , నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే బదిలీపై వివిధ పదవీ బాధ్యతలు చేపట్టిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఎంసీహెచ్ఆర్డీలో ఎ. రేవంత్ రెడ్డిని కలిసిన అధికారుల్లో శిఖా గోయల్ , డీఎస్ చౌహన్ , శ్రీ షానవాజ్ ఖాసీం , శ్రీ తరుణ్ జోషి , శ్రీమతి బి. సుమతి ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా ఏప్రిల్ 30వ తేదీన డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆ వెంట‌నే రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ప‌లువురిని ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా నియ‌మించిన స‌ర్కార్ ఉన్న‌ట్టుండి ఒక్క రోజు కూడా తేడా లేకుండానే త‌న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన శివ‌ధ‌ర్ రెడ్డికి ప్ర‌భుత్వ భ‌ద్ర‌త‌కు సంబంధించి స‌ల‌హాదారుడిగా నియ‌మించారు. ఆ వెంట‌నే సీవీ ఆనంద్ కు డీజీపీగా ఛాన్స్ ఇచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *