కాంగ్రెస్ ముక్తా భార‌త్ అసాధ్యం : పొన్నం

భార‌తీయ జ‌న‌తా పార్టీపై సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత వరకు , ప్రజాస్వామ్యం ఉన్నంత దాకా బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం అన్నారు. ప్రజాస్వామ్యాలకు వేదిక అయిన కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ విభజన పేరుతో మతతత్వం పేరుమీద రాజకీయాలు చేయడమే శాశ్వతం అనుకుంటున్నారని , అది ఎక్కువ కాలం సాగ‌ద‌న్నారు. ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు.

కేరళ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం పట్ల కేసి వేణుగోపాల్ నాయకత్వంలో సతీషన్ , చేణితల అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ ,మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కేరళ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదని అన్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఓడినా గెలిచినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లోనే ఉంటాం అని స్ప‌ష్టం చేశారు. ప్రజాస్వామ్య రక్షణ కు దేశ ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకొస్తార‌ని అన్నారు. తెలంగాణ లో భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *