ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు

కేర‌ళ‌లో యూడీఎఫ్ విజ‌యంపై శ‌శి థ‌రూర్

కేర‌ళ : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యూడీఎఫ్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. సుదీర్గ కాలం పాల‌న సాగించిన లెఫ్ట్ ఫ్రంట్ కు ప్ర‌జ‌లు మంగళం పాడారు. ఈ సంద‌ర్బంగా ఇంకా సీఎం ఎవ‌ర‌నేది తేల‌క పోయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు 102 సీట్ల‌ను క‌ట్ట‌బెట్ట‌డం ప‌ట్ల స్పందించారు శ‌శి థ‌రూర్. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది ప్ర‌జ‌లు సాధించిన విజ‌యం. చ‌రిత్ర‌లో ఎవ‌రూ శాశ్వ‌తంగా ఉండాల‌ని అనుకోవ‌డం పొర‌పాటు. ప్ర‌జ‌లు ఏది త‌లుచుకుంటే వారికే ఓటు వేస్తార‌ని తేలి పోయింది.

ఎవ‌రైతే ప్ర‌జ‌ల వ‌ద్ద ఉంటారో వారే విజ‌యం సాధిస్తార‌ని మ‌రోసారి తేలి పోయింది ఈ ఫ‌లితాలను బ‌ట్టి చూస్తే. ఈ విజ‌యం మామూలు గెలుపు కాద‌న్నారు. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల‌లో భిన్నంగా రిజ‌ల్ట్స్ వ‌చ్చాయి. వాటి గురించి కూడా ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ప్ర‌జా తీర్పును తాము శిర‌సా వ‌హిస్తామ‌ని, ఇది ప్ర‌తి ఒక్క‌రి విజ‌యంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఎందుకంటే ప్ర‌జ‌లు లేక పోతే నాయ‌కులు లేర‌న్నారు. వారి తీర్పు మాకు ఒక బూస్ట్ లాగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *