ఎకో సిస్టమ్ నిర్మించడమే లక్ష్యం

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్

తిరుప‌తి జిల్లా : ఏపీలో ఎకో సిస్ట‌మ్ నిర్మించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ రోజు క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకస్థాపన ఎంతో ముఖ్యమైందని అన్నారు. క్యారియర్ కేవలం ప్లాంట్ ను ఏర్పాటు చేయడమే కాదు. దీర్ఘకాలిక లక్ష్యానికి కీలకమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్లాంట్ ద్వారా భారతదేశ హెచ్ వీఏసీ తయారీ బలపడుతుందని పేర్కొన్నారు. దిగుమతులపై ఆధార పడటం తగ్గుతుందని, . బలమైన లోకల్ సప్లై చైన్ ఏర్పడుతుందని అన్నారు. నెక్స్ట్ జనరేషన్ డేటా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు బలం చేకూరుతుందని చెప్పారు. ఈ విధంగా ఎకో సిస్టమ్ నిర్మిస్తాం. విశాఖలో ఏఐ డేటా సెంటర్ల నుంచి.. రాష్ట్ర వ్యాప్తంగా తయారీ కేంద్రాల వరకు భారతదేశ తొలి పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ నిర్మించడమే మా లక్ష్యం అని చెప్పారు.

ఈ ఎకో సిస్టమ్ లో డేటా సెంటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, కూలింగ్, థర్మల్ మేనేజ్ మెంట్, కాంపోనెంట్ మానుఫ్యాక్చరింగ్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటాయ‌న్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు 2020 విజన్ ను అందరూ విమర్శించారు. ఆయనను సరిగా అర్థం చేసుకోలేదని పేర్కొన్నారు. చంద్రబాబు దార్శనిక నేత. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. దీనిని కచ్చితంగా సాధిస్తాం. భవిష్యత్ లో కూలింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు. అందరూ ఏపీనే ఎందుకు ఎంచుకుంటున్నారని అడుగుతున్నారని పేర్కొన్నారు నారా లోకేష్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *