మ‌హానాడు కోసం 20 క‌మిటీల ఏర్పాటు

ప్ర‌క‌టించిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈనెల‌లో మూడు రోజుల పాటు మ‌హానాడు నిర్వహించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌రిగింది. చీఫ్ ఆదేశాల మేర‌కు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్ రావు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ లు ప‌లు క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. మహానాడు నిర్వ‌హ‌ణ కోసం 20 క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా మే 27,28,29 తేదీలలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది.

మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో 10 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ నియమించారు. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాల కమిటీ ఏర్పాటు చేయ‌గా పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సభా నిర్వహణ కమిటీని నియ‌మించారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి కమిటీని ఏర్పాటు చేసిన టీడీపీ అధిష్టానం. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా మ‌హానాడును నిర్వ‌హించాల‌ని ఆదేశించారు పార్టీ బాస్ నారా చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *