టీవీకే చీఫ్ విజయ్ ని అభిమన్యుడిని చేశారు

పోసాని కృష్ణ ముర‌ళి సంచ‌ల‌న కామెంట్స్

హైద‌రాబాద్ : త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ తీసుకునే నిర్ణ‌యంపై అంతా ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విజ‌య్ ని సీఎంగా చేసేందుకు బీజేపీ, కేంద్రం క‌లిసి నాట‌కాలు ఆడుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రల‌కు తెర లేపారంటూ ఫైర్ అయ్యారు.

వర్నర్ ఆర్లేకర్ కూడా పక్షపాతంగా వ్యవహరించారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గవర్నర్ పై ఒక్క విమర్శ కూడా చేయని విజయ్ గొప్పవాడు అని ప్ర‌శంసించారు. విజయ్ లాంటి గొప్ప వ్యక్తులు ప్రజలకు ఎంతో అవసరం అని అన్నారు పోసాని కృష్ణ‌ముర‌ళి. విజయ్ చుట్టూ ఎన్ని గొడవలు ఉన్నా సంయమనంతో ఉంటాడని అన్నారు. ఇక నా వ‌ర‌కు వ‌స్తే తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌న్నారు. నేను జెంటిల్మన్ ని కానీ డాబర్మన్ లా చూపిస్తున్నారని పేర్కొన్నారు. మంచి చేసే పార్టీకి మద్దతిచ్చానేగాని వైసీపీతో సహా ఏ పార్టీలోనూ చేరలేదన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *